Tuesday, 3 November 2026

ప్రాచీన కళాలను కాపాడుకోవాలి జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్

వీణవంక మార్చి 4: (జనం సాక్షి) వీణవంక మండలంలోని గన్ముకుల గ్రామంలో ప్రాచీన కళాలను ఏప్పుడు కపాడుకోవాలని కరీంనగర్ జిల్లా రంగ స్థల కళాకారుల అధ్యక్షులు వంగ సుధాకర్ కోరారు. మండలంలోని గన్ముకుల గ్రామంలో మూడు రోజులుగా కోనసాగిన చిరుతల రామాయణం ముంగిపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాచీన కళాలకు మంచి ఆధర ఆభిమానాలు ఉన్నాయన్నారు. ప్రాచీన కళలను కాపాడుతున్న కళాకారులకు వెన్నంటిఉంటూ తమవంతు ప్రోత్సాహం అందిస్తామని,ఈ సందర్భంగా ప్రశంస పత్రాలను అందజేసి కళాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జునుతుల సునిత మల్లారెడ్డి ,.ఎంపిటిసి నాగిడి సంజీవరెడ్డి,.జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు సమ్మిరెడ్డి. ,మండల అధ్యక్షులు నల్లగోని రమేష్ తోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.