Tuesday, 3 November 2026

ప్రాజెక్టుల వ్యయంపై అధ్యయనం జరపాలి

– ఎవరి ప్రయోజనం కోసం అంచనా వ్యయం పెంచుతున్నారు?
– నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదలచేయాలి
– తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల
హైదరాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) : నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన పెంచుతోందని, సరైన కారణాలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా జీవోలను విడుదల చేస్తున్నారని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సీతారామ ఎత్తిపోతల పథకం వ్యయం 7కోట్ల నుంచి 13వేల కోట్లకు ఎందుకు చేరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయంతో 35వేల కోట్ల నుంచి 45వేల కోట్లకు చేరడాన్ని ఆయన తప్పుపట్టారు. శ్రీరాంసాగర్‌ వరద కాల్వ వ్యయంతో 4,700 కోట్ల నుంచి 9800 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని రావుల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేవాదుల ప్రాజెక్టుల వ్యయం ఏకంగా రెండితలు చేరి 16,700 కోట్లకు చేరిందన్న ఆయన అంచనా  ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడం ద్వారా ఎవరికి ఉపయోగమో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటుందా? లేక లేక గుత్తేదారుల కోసమే పెంచుతున్నారా చెప్పాలన్నారు. ప్రాజెక్టుల వ్యయంపై లోతైన అధ్యయనం జరపాలని, నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రావుల డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు
చేస్తున్నా, పనులు మాత్రం నత్తనడకన ఆరోపించారు. మద్యానికి సర్కారు పెద్ద పీట వేస్తోందని, బార్ల సమయాన్ని రాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట వరకు పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ నోట సింహం అనే మాట వస్తోందని, అసలు సింహాలు ఊర్లలో ఎందుకు తిరుగుతున్నాయని ఎద్దేవాచేశారు. గతంలో తెలుగుదేశం మద్దతుతోనే కేసీఆర్‌, కేటీఆర్‌ గెలిచారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.