హైదరాబాద్, సెప్టెంబర్ 5 : ప్రాణహిత-చేవెళ్ల రీజైన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు రంగారెడ్డి జిల్లా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై గతకొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సబిత, ప్రకాశ్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఇతరనేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అంతుకు ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష నేతలు నివాళులర్పించి ర్యాలీగా గవర్నర్ వద్దకు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు




