ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సి వి హెచ్ ఓ డాక్టర్ అబ్దుల్ వషీ
పాన్ గల్, ఆగస్టు 11 ( జనం సాక్షి )
గురువారం రోజు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సి వి హెచ్ ఓ డాక్టర్ అబ్దుల్ వషీ మరియు జిల్లా ప్రోగ్రాం పర్యవేక్షణాధికారి సాయి రెడ్డి సందర్శించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాన్ని పరిశీలించి, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రణీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.