ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

కుల్కచర్ల, అక్టోబర్ 12(జనం సాక్షి): కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు.రోగులను కలిసి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.సిబ్బంది మొత్తం హాజరు రిజిస్టర్ చూసి విధులకు క్రమం తప్పకుండా సరిగా రాని వాళ్లకు చుక్కలు పెట్టి మెమోలు ఇవ్వమని డాక్టర్ మురళీకృష్ణను కోరారు.ఆసుపత్రి పరిశుభ్రంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్ఓ చంద్ర ప్రకాష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.