హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన 24న జరిగే సబక్ బంద్ కోసం పరిసర గ్రామాల ప్రజలలో సడక్ బంద్ గురించి అవగాహన కల్పించడానికి సడక్ బంద్ చైతన్య బస్సు యాత్ర గన్‌పార్క్ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన కోదండరాం యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రెండు రోజుల పాటు కర్నూలు – హైదరాబాద్ మధ్య రహదారి వెంట ఉన్న గ్రామాలగుండా సాగుతుంది.




