Wednesday, 4 November 2026

ప్రారంభమైన రాహుల్ పాద యాత్ర…

ఆదిలాబాద్‌:కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కొరిటికల్‌ గ్రామం నుంచి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్‌గాంధీ 15 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. కొరటికల్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. లక్షణ్‌చందా, పొట్టపల్లి, రాచపూర్ మీదుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. దారిపోడవునా రైతులను కలసి వారి నుంచి వినతులు స్వీకరించి మాట్లాడనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలిసి పరామర్చించి భరోస కల్పించనున్నారు. రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *