హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): జంటనగరాల్లో విద్యుత్ ప్రీపెయిడ్ ఏర్పాటుకు మెట్రోజోన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై నగర వ్యాప్తంగా సానుకూలత వ్యక్తం అవుతోంది. దీంతో నగరంలో ఇష్టం వచ్చినట్లు బిల్లులు వచ్చే ప్రమాదం ఉండబోదని భావిస్తున్నారు. రెండు దశల్లో విద్యుత్ విూటర్ల మార్పు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2019 నాటికి పూర్తిస్థా యిలో అందుబాటులోకి తేవాలని విద్యుత్ అధి కారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ స్కీంలో తెలంగాణ విద్యుత్ శాఖకు చేర్చడంతో వినియో గదారులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు మెరు గైన సేవలు అందుబాటులోకి రానున్నట్లు అధి కారులు వివరిస్తున్నారు. ఈ పథకం ద్వారా నగ రమంతా ప్రీపెయిడ్ విూటర్లు ఏర్పాటు పక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగం గానే నగరంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేప ట్టారు. ఆ కార్యాలయాల్లో ఏర్పాటుకు ముందు రూ.200 రీచార్జి చేసి విూటర్లు వినియోగించేలా కార్యాచరణ చేపట్టారు.ఇది సామాన్యులకు మేలు కలుగచేస్తుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అలాగే విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేతకు చెక్ పడుతుందని అన్నారు.
———




