ప్రేమజంటను కాపాడిన హోం గార్డు

వరంగల్‌,మే30( జ‌నం సాక్షి): వరంగల్‌ హంటర్‌ రోడ్‌ లో సంతోషిమాత దేవాలయం వద్ద రైలు పట్టాలు విూద పడి ఆత్మహత్య చేసుకోబోయిన జంటను హోంగార్డు కాపాడాడు. లక్ష్మిపురంకు చెందిన ఇద్దరు ప్రేమికులను అక్కడే ఉన్న హోంగార్డు రవి గమనించి తన ప్రాణాలు తెగించి కాపాడాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారికి సర్ది చెప్పి అక్కడ నుండి పంపించడం జరిగింది. వారి ప్రాణాలు కాపాడిన రవిని పోలీసు అధికారులు అభినందించారు.