Wednesday, 4 November 2026

ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మహిళ మృతి

హైదరాబాద్:ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం వల్ల ఓ మహిళ మృతిచెందింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన కాసేపటికే ఆమె కన్నుమూసింది. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరీ అనే నిండు గర్భిణిని ఫిలింనగర్‌లోని లక్ష్మినర్సింగ్‌హోమ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. దీంతో మహేశ్వరీని కొండాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికే మహేశ్వరీ మృతి చెందడంతో.. ఆమె బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి లక్ష్మినర్సింగ్‌హోమ్‌ డాక్టర్‌ రాజేశ్వరీ కారణంగానే మహేశ్వరీ మృతిచెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *