Wednesday, 4 November 2026

హైదరాబాద్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం

pq87c23iహైదరాబాద్:

హైదరాబాద్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం అయ్యాయి. హోటల్ మారియట్ లో జరుగుతున్న కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వైఫై సేవలను ప్రారంభించారు. తొలి వీడియో కాల్ ను కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో మాట్లాడారు. టెక్నాలజీ పవరంటే ఇదేనని ఆయన కొనియాడారు. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతంలోని ట్యాంక్ బండ్, నెక్లేస్ రోడ్డు, లుంబినీ పార్క్ పరిసరాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.

డిజిటల్ తెలంగాణగా మారుస్తాం: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 

4s0mleb9తెలంగాణను డిజిటల్ రాష్ర్టంగా మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవలు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇంటింటికీ మంచినీళ్లు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినమని, భవిష్యత్తులో ప్రతీ ఇంటికి ఫైబర్ ఆప్టిక్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. త్వరలో హైదరాబాద్ వ్యాప్తంగా వైఫై సేవలు అందిస్తామన్నారు. త్వరలో 4జీ, 5జీ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వైఫై సేవలు అందించేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో తొలి వీడియో కాల్ లో మాట్లాడిన కేటీఆర్.. త్వరలో జరిగే ఈ-హబ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. త్వరలోనే ఢిల్లీకి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *