ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలి.

యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేయాలి.
(యుఎస్ఎఫ్ఐ) *రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి సెప్టెంబర్14:-
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తక్షణ వెనక్కి తీసుకోవాలని మరియు ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని వాటిపైన పూర్తి విచారణ జరపాలని కోరుతూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(యుఎస్ఎఫ్ఐ) కాకతీయ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీలు తెలంగాణలో ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరులు తెలంగాణ వస్తే అందరికీ విద్యా అందుతుందని ఆశించిన అమరుల త్యాగాలను ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం అంటే తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను విస్మరించడమేనని అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల వాళ్ళ ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేసే కుట్రను ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించడమేనని తెలిపారు ప్రభుత్వం ఒకపక్క కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ మరోపక్క ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పై సమగ్ర విచారణ జరిపి ఫీజుల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోతు రాజేష్ నాయక్ యూనివర్సిటీ కార్యదర్శి ఎలకపల్లి సిద్ధార్థ నాయకులు ప్రకాష్ దినేషసూర్య ,రమేష్ ,రాజశేఖర్, కృష్ణ ,లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Attachments area