ఎల్లారెడ్డి-జూన్-7(జనంసాక్షి): ఎల్లారెడ్డి:ప్రైవేట్ స్కూళ్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే స్కూల్ యాజమాన్యం విద్యార్థి సంఘాల పై కేసులు పెడతారా అని టీజీవిపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ మండిపడ్డారు.
TGVP తెలంగాణ విద్యార్థి పరిషత్ ఎల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా TGVP రాష్ట్ర నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ ప్రైవేట్ , కార్పొరేట్ విద్య సంస్థల విద్య వ్యాపారాన్ని అడ్డుకోడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకుల్ని గౌరవించ కుండా విద్యార్థి సంఘా నాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చకొట్టి బ్రిలియంట్ పాఠశాల పై దాడికి పాల్పడే తట్టు చేసిన యాజమాన్యం వెంటనే విద్యార్థి సంఘాల నాయకులకు క్షమాపణ చెప్పి అరెస్ట్ అయిన విద్యార్థి నాయకులను విడుదల చేయించి కేసులు వెనుకకు తీసుకోవాలి అన్నారు.ప్రైవేట్ స్కూల్లో
కనీస వసతులు లేని విద్యా వ్యాపారానికి పాల్పడుతున్న పాఠశాలపై క్రిమినల్ కేసులు పెట్టె వరకు, గుర్తింపు రద్దు అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీజీవిపి రాష్ట్ర నాయకుడు మలోత్ ప్రకాశ్ నాయక్,రాథోడ్ దేవిసింగ్, అల్లూరి,సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




