ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవరానివి

 తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 6 :: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయంతి తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు తెలంగాణ ప్రజలు మరిచిపోరని మెదక్ జిల్లా ఎంపీపీలపురం ఉపాధ్యక్షురాలు తూప్రాన్ ఎంపీపీ గడ్డి స్వప్న పేర్కొన్నారు మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన చిత్రపటానికి పూలమాలవేసి న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి అమలు చేయాలని కోరారుతెలంగాణ సిద్ధాంత కర్త శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి సందర్భంగా తూప్రాన్ లోని ఎంపీడీఓ ఆఫీస్ లో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి వారికి మనస్సుమాంజలులు తెలిపారు ఈ కార్యక్రమంలో   మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి యవాపూర్ ఎంపీటీసీ సంతోష్
ఎంపీడీఓ అరుంధతిఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు