Tuesday, 3 November 2026

ప్లాస్టిక్ మనీతో నల్లధనానికి చెక్

హైదరాబాద్ : దేశంలో నల్లధనం చలామణిని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నిర్ణీత స్థాయి దాటి సాగే నగదు లావాదేవీలపై పాన్‌కార్డు వివరాల సమర్పణను త్వరలో తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫేస్‌బుక్ ద్వారా ఆదివారం నెటిజన్లతో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. భారతీయుల నల్లధనంలో అత్యధికం దేశంలోనే ఉందన్న జైట్లీ… ప్లాస్టిక్ కరెన్సీ వాడకాన్ని ప్రామాణికం చేసి అసాధారణ పరిస్థితుల్లోనే నగదు వాడకం జరిగేలా ప్రజల వైఖరిలో మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పును ఆచరణలోకి తెచ్చేందుకు వివిధ ప్రాధికార సంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *