Wednesday, 4 November 2026

ఫలించిన అల్లం నారాయణ సర్ కృషి…

 

జర్నలిస్టులకు రైల్వే పాస్ ల జారీ ప్రారంభం

 

 

టి యూడబ్ల్యూ జే (హెచ్ 143) హర్షం

 

రైలు ప్రయాణంలో జర్నలిస్టులకు రాయితీని రైల్వే బోర్డు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ
రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పాటు కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి రైలు ప్రయాణాల్లో జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులకు రైల్వే పాస్ లను జారీ చేయాలని కోరారు.దీంతో
పునరాలోచించిన రైల్వే బోర్డు ఎట్టకేలకు సీనియర్ సిటిజెన్స్ తో పాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో రైల్వే శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుండి సంకేతాలు రావడంతో రైల్వే పాస్ ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. జర్నలిస్టులు తమ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పాస్ లను పొందగలరు. రైలులో రాయితీ కోసం పట్టువీడకుండా ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు,
ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రులకు, రైల్వే బోర్డు అధికారులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
పక్షాన జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.