Friday, 6 November 2026

ఫలితాలిస్తున్న బడిబాట

 

 

 

 

తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు: డిఇవో

ఆదిలాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): గతంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలల్లో మౌలికవసతులు చాలా మెరుగుపడ్డాయని జిల్లా విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు. సర్కార్‌ బడులపై నమ్మకం పెంచేలా చేస్తున్నామని, తల్లిదండ్రలు ఆలోచనలో కూడా మార్పులు వస్తున్నాయని అన్నారు. పిల్లల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం మంచి ఫలితం ఇచ్చిందని అన్నారు. బడీడు కలిగిన పిల్లలను చేర్పించేలా కార్యచరణ రూపొందించామన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా అదనపు తరగతి గదులు, ఫర్నీచర్‌ ఏర్పాటుతో పాటు పాఠశాలలకు ప్రహరీలు నిర్మిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా మరుగుదొడ్డి లేదని తెలిస్తే వెంటనే నిర్మించేలా ప్రణాళిక తయారుచేశాం. ముఖ్యంగావంటశాలలను సైతం ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. జిల్లాలోని సర్కారు బడుల్లో మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందులో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తామన్నరు. బడిబాటతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు ఉపాధ్యాయులు ముందుకురావాలి. బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేలా బడిబాట కార్యక్రమం చేపడుతున్నా మన్నారు. ప్రైవేటు పాఠశాలలు తాము వసూలు చేస్తున్న రుసుముల వివరాలను పాఠశాల నోటీసుబోర్డుపై ప్రదర్శించాల్సి ఉందన్నారు. గతేడాది జిల్లాలో 26 చోట్ల ఇంగ్లీష్‌ విూడియం తరగతులు ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని విద్యాశాఖమంత్రి సూచించారు. జిల్లాలో మరిన్ని ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు ముందుకురావాల్సి ఉందన్నారు. వారు ముందుకొచ్చిన ప్రతిచోట ఏర్పాటుచేస్తామన్నారు. సర్కార్‌ స్కూళ్లతో పోలిస్తే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని కూడా పేరెటంల్స్‌ గుర్తించారని అన్నారు.

ప్రైవేటులో పిల్లలను చేర్పించే సమయంలో పాఠశాలకు గుర్తింపు, మౌలిక వసతులు తదితర వాటిని తల్లిదండ్రులు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం పెంచేందుకు బయోమెట్రిక్‌ విధానం మంచి ఫలితం ఇవ్వనుందన్నారు.