Wednesday, 4 November 2026

ఫిరాయింపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి):  పార్టీ ఫిరాయింపులపై పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పార్టీ ఫిరాయింపుపై ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలకు, ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొలిసారి శాసనసభ సభాపతి, మండలి చైర్మన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. తెదేపా ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, ధర్మారెడ్డి ,కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు  యాదవరెడ్డి, ఆమోస్‌, భానుప్రసాద్‌, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలకునోటీసలుఉల ఇచ్చారు. వీరంతా టిఆర్‌ఎస్‌లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *