Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజేపికి పడుతుంది

ప్రత్యేక ¬దా కల్పించకపోతే బిజేపి కార్యాలయాలకు ప్రజలే తాళాలు వేస్తారు
రాయలసీమ జనతా పార్టీ నేత గుప్తా విమర్శ
కర్నూలు,మార్చి3(జ‌నంసాక్షి): కేంద్రం సహకరిస్తే తప్ప మేమేం చేయ్యలేం’ అని టీడీపీ చేతులేత్తేస్తే, కేంద్రం మెడలు వంచే ప్రక్రియలో కాంగ్రెస్‌,వైఎస్సార్సీపీ విూన మేషాల్లెక్క పెడ్తున్నాయని, దీంతో సీమ ప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారని, రాజధాని లేదు…. అభివృద్ది లేదని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విూడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘పోరాడితే పోయేదేం లేదు ఢిల్లీ పెత్తనం తప్ప’ అనే ఉక్కు సంకల్పం సీమ యువత బిక్క చచ్చిపోయే పరిస్థతి వచ్చిందంటే, దానికి ముమ్మాటికీ కారణం రాజకీయమేనని  అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు… అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశాయి. ఆ ఆవేదనలోంచే మ¬ద్యమం పుట్టుకొచ్చే పరిస్థతిలు స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. జనం రోడ్డేక్కే పరిస్థితిని తీసుకోచ్చిన రాజకీయం, ప్రజా ఉద్యమానికి తలొగ్గుతుందా? గతంలోలా తన కాళ్ళకింద వేసి తొక్కేస్తుందా? రానున్న రోజుల్లో రాయలసీమలో ఉద్యమం తప్పేలా లేదని అన్నారు.  న్యాయం కోసం పోరాడేందుకు మొత్తం నాలుగు జిల్లాల్లోని ప్రజానీకం నడుంబిగించేందుకు సమాయత్తమవుతున్నారని అన్నారు.  అవసరమైతే బిజేపికి పాడె కట్టేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారన్నారు. సీమ ఉద్యోగులూ పోరుబాట పట్టాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారని, రాజకీయ పార్టీలే ఇంకా తటపటాయిస్తున్నాయన్నారు.  తాము కోరుకోని విభజనను, తాము వద్దన్న విభజనను తమ నెత్తిన బలంగా రుద్దేసిన కేంద్రం, తమను అభివృద్దికి దూరంగా విసిరి పారేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. సగటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం. అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, రాయలసీమకు ఒరిగిందేవిూ లేదని ఆయన విమర్శించారు. అప్పుడు కాంగ్రెస్‌ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ని విడగొడితే, ఇప్పుడు అభివృద్ది పధాన పయనించాల్సిన ఆంధ్రప్రదేశ్‌కి భారతీయ జనతా పార్టీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది  అన్నారు. విభజన చట్టంలో ఏముంది? ఇప్పుడు ఏం జరుగుతొంది? అని లెక్క లేసుకుంటే, అసలు పొంతన లేని పరిస్థితి అన్నారు. ముంపు మండలాల్ని ఆంధ్రపధేశ్‌కి బదలాయించగానే పోలవరం ప్రాజెక్టుకి ఇక అడ్డంకులేవీ లేవని అంతా అనుకున్నారని, కానీ, 16వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకి ‘ముష్టి’ వంద కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమన్నారు. అదేమని ప్రశ్నిస్తే,కేటాయింపులు తగ్గినమాట వాస్తవమేనని బీజేపి నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే ఒప్పుకుంటోన్న పరిస్థితి ఏర్పడిందిని, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతున్నది నిజమని దాన్ని  వెంకయ్యనాయుడు సర్టిపై చేశారని అన్నారు. ‘కాంగ్రెస్‌ అన్యాయం చేసింది’ అని ఎన్నికల్లో నినదించి, చెప్పకోదగ్గ సంఖ్యలో ఓట్లు, సీట్లు సాధించుకుంది భారతీయ జనతా పార్టీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందని, పలు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం బీజేపీ పై వత్తిడి తీసుకుని రావాలని గుప్తా పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *