Wednesday, 4 November 2026

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను పలువురితో పంచుకునే ఆయన ఇప్పుడు తన ఆలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకోనున్నారు. 81 ఏళ్ల అబ్దుల్‌ కలాం ఇప్పటికే యూ ట్యూబ్‌ వీడియో షేరింగ్‌లో ఉన్నారు. కాగా తన ఫేస్‌ బుక్‌కు ‘బిలియన్‌ బీట్స్‌’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. పేరు కూడా ఆయన ఆలోచనా ధోరణికి సరిపోయే విధంగా ఉంది కదూ. ఇప్పటికే తాను నిర్వహిస్తున్న ఈ పేపర్‌కు ఇది ఎక్స్‌ టెన్షన్‌ అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *