ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కార్టూన్లు : వ్యక్తి అరెస్టు

లక్నో : ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తదితరులపై విద్వేషపూరిత అంశాలు ఫేస్‌లబుక్‌లో పోస్ట్‌ చేసినందుకు ఆగ్రా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సంజయ్‌ చౌదురి అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్దనుంచి లాప్‌టాప్‌, సిమ్‌కార్డు, డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.