నెల్లూరు : మే నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. 9 మంది ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సరికాదని, ఎవరినీ బహిష్కరించలేదని మంత్రి అన్నారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో బలం నిరూపిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి అధిష్ఠానం వద్ద సంప్రదింపులు జరుపుతున్నారని, అందరితో సంప్రదింపుల అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం పెరగడం వల్లే సహకార ఎన్నికల్లో విజయం లభించిందన్నారు.




