హైదరాబాద్,జూన్26(జనం సాక్షి): సోషల్ విూడియా మోజులో మోసపోయి బాలిక గర్భవతి కావడానికి కారకుడైన యువకుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఫేస్‌బుక్‌లో స్నేహం చేసిన యువకుడు ఓ అమాయక యువతని మోసం చేసి శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేసి పరార్ అయ్యాడు. ఈ సంఘటన హుమాయూన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక(17)కు తల్లి దండ్రులు లేకపోవడంతో మాసాబ్‌ట్యాంక్ ఎంజీనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ వద్ద ఉంటుంది. ఈమెకు రెండు సంవత్సరాల క్రితం అవిూర్‌పేట్‌లో నివసిస్తున్న అవిూరుద్దీన్ అలియాస్ జునైద్ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. గత ఏడాదిన్నర కాలంగా ఇతను ఎంజీనగర్‌లో ఉన్న బాలిక వద్దకు వస్తూ పోతున్నాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి సదరు యువకుడితో గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మమ్మ చూసింది. ఈ నెల 19న బాలికకు ఆరోగ్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. అమ్మాయి గర్భవతి అన్న విషయం తెలుసుకున్న ఆ యువకుడు తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయినట్లు గమనించిన బాలిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆధారనలు సేకరించిన పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.




