Wednesday, 4 November 2026

బలముంటే ఇతర పార్టీల వారినెందుకు చేర్చుకోవాలి

టిఆర్‌ఎస్‌దే మేకపోతు గాంభీర్యం: డికె అరుణ

హైదరాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): ఎన్నికలు,సవాళ్లు కాంగ్రెస్‌ పార్టీకి కొత్తకాదని మాజీమంత్రి డికె అరుణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ కొత్త పార్టీ కాదని, ఎన్నికలెప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని డికె అరుణ తెలిపారు. మంగళవారం ఆమె విూడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ మాత్రమే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్నారు. పార్టీ బలంగా ఉంటే ఇతర పార్టీల నుంచి ఎందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి భయం పట్టుకున్నందుననే తమ పార్టీకి చెందిన వారిని చేర్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఉద్యమకారులను కాదని ఇతర పార్టీల నుంచి ఎందుకు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యమకారులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. టిఆర్‌ఎస్‌ బలహీనంగా ఉంది కాబట్టే ఇతర పార్టీల నేతలను కెసిఆర్‌ చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లోనే కాదు అన్నీ పార్టీల్లోనూ విభేదాలున్నాయని, కెసిఆర్‌ కుటుంబంలోనే విభేదాలుండగా కాంగ్రెస్‌లో ఉండవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విబేదాలంటూ ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం మూర్ఖత్వం కాకా మరోటి కాదన్నారు. విభేదాలు తమ అంతర్గ సమస్యన్నారు. పాలమూరు ప్రాజెక్టు పెండింగ్‌కు మంత్రి జూపల్లి కృష్ణరావు కారణమని, గద్వాలకు సిఎం కెసిఆర్‌ రాకను స్వాగతిస్తున్నామని డికె తెలిపారు.