Tuesday, 3 November 2026

ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో బాధితులకు ఆర్థిక సహాయం

రఘునాథ పాలెం 27(జనం సాక్షి)

మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల అసోసియేషన్ సభ్యులైన భూక్యా గణేష్ కు హై బీపీ రావటం వల్ల తలలో బ్లడ్ క్లాట్ అయింది. ప్రశాంతి హాస్పిటల్లోనే నెల రోజులు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చారు. అసోసియేషన్ వారు పరామర్శించి 10000 వేలు రూపాయలు ఆర్థిక సహాయము అందించారు గణేష్ పూర్తిగా కోలుకోవడానికి అదేవిధంగా మంచుకొండ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బానోత్ ఉపేందర్ ప్రోగ్రాం కు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మోకాలు ప్యాక్చర్ కావడంవలన మండల ఫోటోగ్రాఫర్ స్ అసోసియేషన్ వారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ వారు స్పందించి రూ.7216 రూపాయలు ఆర్థిక సాయంను అందించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య బాలాజీ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరికీ యూనియన్ అన్నివేళలా అండగా ఉంటమని యూనియన్ ఐడి కార్డ్ తీసుకొని ఉండాలి అని అన్నారు, మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ ప్రధాన కార్యదర్శి గుగులోత్ అనిల్ కుమార్, ట్రెజరర్ కేలోత్ రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు సచ్చు వీరబాబు, జూకంటి భద్రాచరి జాయింట్ సెక్రెటరీ ఆడెపు హనుమంతరావు, కార్యవర్గ సభ్యులు మాలోత్ రవికుమార్ ,బానోత్ ఫుల్ సింగ్, ఎస్.కె యాసిన్, వాంకుడోత్ జగదీష్, గూగులోత్ మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు