Wednesday, 4 November 2026

ఫోటో రైటప్ : ఉప సర్పంచ్ గా ఎన్నికైన రజిత కు సన్మానం

చాగల్ ఉప సర్పంచ్ గా పొన్న రజిత
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 29 , ( జనం సాక్షి) : మండలంలోని చాగల్ ఉప సర్పంచ్ గా పొన్న రజితరాజేష్ ను ఎన్నుకొన్నారు. ఇంతకు ముందు ఉప సర్పంచ్ గా ఉన్న పొన్న బోయిన రవికుమార్ ఇటీవల మృతి చెందగా అతని స్థానంలో నూతన ఉప సర్పంచ్ ను ఎన్నుకోవడం కోసం గ్రామపంచా యతీ కార్యాలయంలో ప్రత్యేకంగా వార్డు సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ పోగుల సారంగపాణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 11 మంది సభ్యులకు గాను,ఆరుగురు వార్డు సభ్యులు హాజ రు కావడంతో ఎన్నికకు సరిపడాకోరంఉండడంతో నూతన ఉప సర్పంచ్ గా పొన్న రజితను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పోగుల సారంగపాణి, ఎంపీడీవో కృష్ణ, ఎంపిఓ సుధీర్, పంచాయతీ కార్యదర్శి అశ్విన్ కుమార్, కారోబార్ చిరంజీవులు, వార్డు సభ్యులు బూర్ల కుమార్,బూర్ల యాకలక్ష్మి,పోలుసంతోష్ కుమార్, బాస్కుల విక్రం, ముప్పిడి అనిత పాల్గొన్నారు.