Tuesday, 3 November 2026

ఫోటో రైటప్: మాట్లాడుతున్న మారపాక రవి

కెసిఆర్ నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
…. జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 30 , (జనం సాక్షి ) : తెలంగాణరాష్ట్రం ఏర్పడినతర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని, పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు.నూతనం గా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను మండలంలోని తాటికొండ, కొత్తపల్లి, మీదికొండ, రాఘవపూర్ గ్రామపంచాయతీలలో జడ్పీస్టాండిం గ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య,వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి కొత్త పెన్షన్ కార్డుల ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథ కాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దళితులు ఆర్థి కంగా ఎదగడానికి దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల దళిత బందు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొం డ రాజయ్య అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాడు అని అన్నారు.అర్హత ఉండికూడా పెన్షన్ రానివారి కి కూడా పెన్షన్లు వచ్చేవిధంగా కృషిచేస్తాననిఎమ్మె ల్యే రాజయ్య చెప్పడం జరిగిందన్నారు.నిరంతరం ప్రజల్లోఉంటూ ప్రజాసమస్యల పరిష్కారమేలక్ష్యం గా ఎమ్మెల్యే కృషిచేస్తున్నారని అన్నారు.ఈ సమా వేశంలో వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి,సర్పంచులు చల్ల ఉమా సుధీర్ రెడ్డి, ఆనందం, నాగరబోయిన మణెమ్మ యాదగిరి, కందుల శ్రీలత, ఉపసర్పంచు లు మారపాక రాములు, ఎం మహేందర్, రంజిత్ కుమార్, మల్లయ్య, గ్రామ పంచాయతీ కార్యద ర్శులు శేఖర్,రాజు,అనురాధ,వార్డుసభ్యులు తది తరులు పాల్గొన్నారు.