Wednesday, 4 November 2026

ఫోటో రైటప్ : మాట్లాడుతున్న టిపిసిసి సభ్యుడు గంగారపు అమృతరావు

అడ్డాల కోసం కాదు అభివృద్ధి పై దృష్టి సారించండి
… నియోజకవర్గానికి పట్టిన చీడ పురుగులు రాజయ్య, శ్రీహరి
…  టిపిసిసి సభ్యుడు గంగారపు అమృతరావు
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 01 , (జనం సాక్షి ) : నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అడ్డాల కోసం పోటీ పడకుండా అభివృద్ధిపై దృష్టి సారిస్తే నియో జకవర్గ ప్రజలు సంతోష పడతారని, గత ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికిపట్టిన చీడ పురుగులుఎమ్మెల్యే రాజయ్య,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అని టిపిసిసి సభ్యుడు గంగారపు అమృతరావు అన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమృత రావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకులమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే రాజ య్య,ఎమ్మెల్సీ కడియంశ్రీహరిఎమ్మెల్యేలుగా, ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారు తప్ప నియోజక వర్గానికి ఎలాంటి అభివృద్ధిచేయాలన్నారు.ఇద్దరు నాయకులు అభివృద్ధిలో పోటీ పడకుండా పత్రిక ల ముఖంగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పిల్లల డాక్టర్ అయినా ఎమ్మెల్యే రాజయ్య ఉపముఖ్యమంత్రిగా,వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి తీసుకురాలేకపోయినా దద్దమ్మ అన్నారు.పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే లెక్చరర్ గా పనిచేసిన కడియం శ్రీహరి,ఉప ముఖ్యమంత్రి గా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కూడా నియోజ కవర్గానికి డిగ్రీ కళాశాల తేలేకపోయినా అసమర్థ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు.ఒకరు చీక టి బాగోతం, ఒకరు చిల్లర బాగోతం అని విమర్శిం చుకుంటున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని మరిచారన్నారు.రాజయ్య నియోజక వర్గాన్ని అవి నీతిమయంగా మార్చాడు అంటున్నా కడియం శ్రీహరి రాజయ్య గెలుపుకు సహకరించింది ఆయ నే కాబట్టి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమా పణ చెప్పాలని అన్నారు. నియోజకవర్గానికి పట్టి న చీడ పురుగులు రాజయ్య,శ్రీహరిఅని ఈనియో జకవర్గంలో ఏఒక్క ధళితునికిమూడెకరాలభూమి ఇప్పించలేక పోయారని,డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేక పోయారు అని అన్నారు.నియోజకవర్గం లో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్పా, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు నిర్మిస్తే వాటి ద్వారా పిల్ల కాలువలు కూడా పూర్తి చేయని దద్దమ్మలు కడియం శ్రీహరి, రాజయ్యలే అని అన్నారు.అర్హులైన వారికి దళితబంధు అంద డంలేదని అన్నారు. టిడిపి హయాంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగింది వాస్తవమేనని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులుచింత ఎల్లయ్య,గడ్డమీది సురేష్,చింత జోత్స్నా,ప్రసాద్, ఐలయ్య,మార్క శ్రీనివాస్,సింగపురంవెంకటయ్య, కోరుకొప్పుల మహేందర్, సింగపురం రాజు, రామ్ చందర్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.