మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 , ( జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎంపీపీ గట్టు శోభ భర్త, తెలంగాణ ఉద్యమకారుడు గట్టు రాజు (55) మృతి చెందడం జరిగింది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అక్కడకు చేరుకొని గట్టు రాజు పార్థివ దేహాన్ని సందర్శించి, పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తనప్రగాఢ సానుభూతి తెలిపారు.పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేడాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణా రెడ్డి,గ్రామ సర్పంచ్ తాటికొం డ సురేష్ ,మాజీ మండలఅధ్యక్షుడు గట్టురమేష్, నాయకులు ఇనుగాల నర్సింహా రెడ్డి , శ్రీనివాస్, నాగరబోయిన యాదగిరి , జనగాం యాదగిరి , ఎంపీటిలు గన్ను నర్సింహులు , మునిగాల రాజు , గ్రామాశాఖ అధ్యక్షుడు మునిగాల రాజు తదిత రులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య




