ఫ్యాన్సీ డ్రెస్సుల్లో అలరించిన చిన్నారులు..

ఊరుకొండ, ఆగస్టు 22 (జనం సాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు భరతమాత, జాతీయ జెండాలను చేత పట్టుకొని వివిధ వేషధారణలతో చూపరులను అలరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.