హైదరాబాద్: భారత్‌లో ఆర్థిక స్థిరత్వం చేకూర్చడంతో పాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో తర్వాతి విదేశీ పర్యటన ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలలో చేపట్టనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. మొదట ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత కెనడాలలో పర్యటిస్తానని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లోని పారిస్ వద్ద ఉన్న హైటెక్ ఇండస్గీలను సందర్శించనున్నట్లు చెప్పారు.




