Tuesday, 3 November 2026

ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి…

గ్రామీణ ఎస్సై నాగరాజు
వేములవాడ రూరల్, ఆగస్టు 10 (జనం సాక్షి) : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు గ్రామీణ ఎస్సై నాగరాజు తెలిపారు. ఆగస్టు 11 (గురువారం) ఉదయం 6:30 గంటలకు వేములవాడలోని చెక్కపల్లి బస్టాండ్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దేశ సమైక్యతను చాటేలా అధిక సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ఉత్సాహవంతులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.