హైదరాబాద్ : బంగారు తెలంగాణ చేసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులమతాలు గౌరవించబడాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధించుకోగలుగుతామని, దానికి సీఎం కేసీఆర్ పునాదులు వేశారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మేడే ఉత్సవాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వకేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, అతి తొందరలోనే నిజం కాబోతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో వెల్ఫేర్ స్టేట్ కింద పరిగణించబడిందని నాయిని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.




