Monday, 2 November 2026

మొగుళ్లను కొట్టండి : పెళ్లి కూతుళ్లకు బ్యాట్లు గిఫ్ట్

ఏ మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్లినా.. డబ్బో.. వస్తువులో గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ ఒక పెద్దమనిషి అసాధారణమైన దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరూ ఊహించని ఆ గిఫ్ట్ బ్యాట్. ఇంతకూ ఎందుకో తెలుసా.. భర్త తాగొచ్చినా.. వేధింపులకు గురి చేసినా.. వెంటనే నాలుగు తగిలించడానికి… విచిత్రంగా ఉంది కదూ.. ఈ ఆలోచన. ఇది మధ్యప్రదేశ్ లోని ఓ సామూహిక వివాహ మహోత్సవంలో జరిగింది. ఈ సందర్భంగా 700 జంటలు ఒక్కటయ్యాయి. పెళ్లికి హాజరైన రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్.. అమ్మాయిలకు బ్యాట్ లను కానుకగా ఇచ్చారు. వీటిని స్థానికంగా మోగ్రీ అంటారు. వీటితో మురికిపట్టిన బట్టలు ఉతుకుతుంటారు. అయితే వీటిని తాగితందనాలు ఆడే మగాళ్లను కొట్టడానికి ఉపయోగించమంటున్నారు మంత్రిగారు. అంతేకాదండోయ్… మరో సలహా కూడా ఇచ్చారు. మొదట మాటలతో చెప్పి.. ఆ తర్వాతే బ్యాట్ తో మాట్లాడాలని చెప్పారు. పోలీసులు అడ్డు రారని కూడా సూచించారు. వాటిపై ‘తాగుబోతులను కొట్టే బ్యాట్’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు గోపాల్ భార్గవ్. ఆలోచన బాగుంది కదండి… ఇంకేం ఫాలో అయిపోదామనుకుంటున్నారా..? అసలే మ్యారేజ్ ల కాలం… ఛలో గెట్ రెడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *