హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని రాడిసన్‌బ్లూలో ఐఐఎఫ్‌టీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. త్వరలోనే ఫిలిం సిటీని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఫిలిం సిటీ నిర్మాణానికి భూ కేటాయింపులు కూడా జరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే సమీక్ష జరిపారని తెలిపారు.




