హైదరాబాద్: బంజారాహిల్స్లో ఓ కారు భీబత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ సమీపంలో ఐదుగురు యువతులు కారులో వేగంగా వస్తూ… పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువతులకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు నుజ్జు నుజ్జు కావడంతో ఐదుగురు యువతులు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు క్రేన్ద్వారా కారును రోడ్డుపై నుంచి తొలగించారు. కారులో ఉన్న యువతులు మద్యం సేవించి వేగంగా వచ్చి అదుపు తప్పారా? లేక ప్రమాద వశాత్తూ జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.