Monday, 2 November 2026

బంజారాహిల్స్‌లో కార్డన్‌సెర్చ్

బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్, హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు ప్రతీ ఇంటినీ, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *