Monday, 2 November 2026

బిపాసా-కరణ్‌ల పెళ్లి అదిరెన్‌..!

1cinibipasaba1ముంబయి: బాలీవుడ్‌ నటి బిపాసా బసు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ల వివాహం వేడుకగా జరిగింది. శనివారం ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు హాజరయ్యారు. వేడుకలో బిపాసా ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లికళతో మెరిసింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బిపాసాబసు స్నేహితులు నూతన వధువరులకు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ… వారి ఫొటోలను పోస్ట్‌ చేశారు.శనివారం రాత్రి వీరి వివాహ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, టబు, సోనమ్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ప్రీతి జింటా, సుస్మితా సేన్‌, సంజయ్‌దత్‌ దంపతులు, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా తదితరులు హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *