బంజారా భవనం ప్రారంభోత్సవానికి బయలుదేరిన గిరిజనులు బంజారా లు
పెద్దవంగర సెప్టెంబర్ 17(జనం సాక్షి ) పెద్దవంగర మండల సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవానికి తరలిన బంజారాలు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.చేతుల మీదుగా, శనివారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవని కి పెద్దవంగర మండలం నుండి అన్ని గ్రామాల మరియు తండాల నుండి బయలుదేరుతున్న బస్సులను ప్రారంభించిన స్థానిక ఎంపీపీ, ఈదురు రాజేశ్వరి ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎండీ ఖుర్ష ద్,తహసీల్దార్ జి రమేష్ బాబు, ఎంపీడీఓ బి, వేణు గోపాల్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు భానోత్ రవీందర్, బానోత్ విజయ్ సోమన్న, సర్పంచులు గూగుల్ పటేల్ , దారావత్ రాజేందర్ , భీమ, బానోత్ జమున గోపాల్, తెరాస సీనియర్ మండల నాయకులు,ఎస్ టీ, సెల్ మండల అధ్యక్షులు, తండాల అధ్యక్షులు,గిరిజనులు, ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు