హైదరాబాద్: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండున్నర గంటలపాటు తమ కార్యాలయంలో ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయానికి ఉదయం తీసుకెళ్లిన అధికారుల, ఆదాయ వివరాలు, ఐటీ రిటర్నులకు సంబంధించి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి గబ్బర్‌సింగ్ సినిమా వసూళ్ల వ్యవహారంలో రిటర్నులకు, ఖాతా పుస్తకాల్లో చూపించిన లెక్కలకు తేడాలున్నట్లు గుర్తించిన అధికారులు ఈ అంశంపైనే ఆయనను విచారించినట్లు సమాచారం తెలిసింది.




