బక్కన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలి
సూర్యాపేట (జనంసాక్షి): పీడిత ప్రజల నాయకులు, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు బక్కన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బహుజన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య , సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ అన్నారు.గురువారం సూర్యాపేట మండలం రామచంద్రపురం గ్రామంలో బక్కన్న స్థూపం వద్ద జరిగిన రెండవ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్కన్న గత 30 ఏళ్ల నుంచి మారోజు వీరన్న సిద్ధాంత రాజకీయాలు కొనసాగిస్తూ , సమాజం కోసం జరుగుతున్న పోరాటంలో అగ్రభాగాన నిలబడి పోరాడిన నాయకులని కొనియాడారు.మండారి ప్రభాకర్ అడుగుజాడల్లో కొనసాగుతూ సారా వ్యతిరేక ఉద్యమం, రైతులకు గిట్టుబాటు ధర, మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా వీరన్న తీసుకొచ్చిన కుల వర్గ జమిలి పోరాటంలో క్రియాశీలకంగా ఉండి పోరాడారని గుర్తు చేశారు.ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు నారగోని వెంకట యాదవ్ , పార్టీ నాయకులు ఎండి రఫీ, మోసంగి మల్లయ్య , భూపతి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.