బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి.
ఎస్సై కృష్ణ ప్రసాద్.
చిట్యాల8( జనం సాక్షి) బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సై కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేయవద్దని, ప్రభుత్వం గోవధను నిషేధించిందని తెలిపారు. మతాలను గౌరవించుకుంటూ పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్, మసీద్ అధ్యక్షులు అజ్మీత్ మియా, రాజాక్,అంకూస్, ఖాజా పాషా, ఇర్ఫాన్, ఇమామ్, దిల్ బహార్ తదితరులు పాల్గొన్నారు.