Wednesday, 4 November 2026

బచ్పన్ స్కూల్ ల్లో ఘనంగా కలర్స్ డే వేడుకలు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు,27,జనంసాక్షి,,, జిల్లా కేంద్రంలోని నటరాజ నగర్ బచ్ పన్ పాఠశాలలో శనివారం  విద్యార్థులు పింక్ కలర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని,విద్యార్థులు, ఉపాద్యాయులు, అందరు పింక్ కలర్ దుస్తులు  ధరించుకొని కేకు కట్ చేశారు, వివిధ రకాల బొమ్మలు తయారు చేశారు.తరగతి గదుల్లో పింకు రంగు బెలూన్ లతో అలంకరణ చేశారు. పిల్లల కు పింక్ కలర్ గురించి వివరించారు. ఈసందర్భంగా పాఠశాల కరాస్పాండెంట్ అయ్యన్నగారి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తో పాటు ఆటలు,క్రీడలల్లో కూడ రాణించాలని అన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయ్యన్నగారి రచన,ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.