Monday, 2 November 2026

బట్టి యాత్ర లో ఐఎన్టీయుసి..కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే  లక్ష్యం

బట్టి యాత్ర లో ఐఎన్టీయుసి.జనక్ ప్రసాద్….. యూనియన్ విజయానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పూర్తి సహకారం ౼ సిఎల్ పి నేత శ్రీ.బట్టి విక్రమార్క………సిఎల్పి నేత బట్టి విక్రమార్క  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బెల్లంపల్లి పట్టం కోల్ బెల్ట్ ఏరియాకు చేరుకున్న సందర్భంగా వారికి వందలాది ఐ ఎన్ టీ యుసి శ్రేణులు,యూనియన్ సెక్రెటరీ జనరల్ బి .జనక్ ప్రసాద్  నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐ ఎన్ టీ యుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్  మాట్లాడుతూ సిఎల్పి నేత బట్టి విక్రమార్క  పాదయాత్ర గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతున్నదని రాహుల్ గాంధీ  నేతృత్వంలో కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్రంలో బిఆర్ఎస్ , కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విజయానికి యూనియన్ తరుపున శయశక్తుల కృషి చేస్తామని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బట్టి  చేస్తున్న ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్క  మాట్లాడుతూ యూనియన్  కాంగ్రెస్ పార్టీకి అత్యంత పటిష్టమైన అనుబంధ సంఘమని త్వరలో జరబోయే సింగరేణి ఎన్నికల్లో ఐ ఎన్టీయుసి గెలుపుకై కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఎన్ టీయుసి కేంద్ర కమిటీ నాయకులు కాంపెళ్లి సమ్మయ్య, భీమ్ రావ్, కళవేణి శ్యామ్,గరిగ స్వామి, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి,ఆర్కేపి ఏరియాల ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, శంకర్ రావు, పేరం శ్రీనివాస్, తేజవత్ రాంబాబు నాయకులు మాధవ కృష్ణ, డి.చంద్రశేఖర్, కారుకురి తిరుపతి, భీం రవి, కృష్ణమూర్తి,పరమేశ్వర్, విక్రమోద్దీన్,తిరుపతి, రాజేంద్రప్రసాద్, కలమండ స్వామి వివిధ గనుల పిట్ కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు*