Wednesday, 4 November 2026

బడం పేట రాచన్న స్వామి ప్రధాన పూజరికి వైదిక పురోహితరత్న అవార్డు

 

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్  శిఖరం ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఉగాది జాతీయస్థాయి పురస్కారాల్లో భాగంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంవత్సరానికి గాను హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులై సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు సదా కృషి చేస్తున్న వేద పండితులకు , సంఘ సేవకులకు ఉగాది నంది పురస్కారాలను శ్రీ త్యాగరాయ గానసభ చిక్కడపల్లి హైదరాబాదు వేదికగా  ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బ్రహ్మశ్రీ చిట్టి పెద్ది రామశర్మ, బ్రహ్మశ్రీ మల్లికార్జున గురూజీ వేద పండితులు చేతుల మీదుగా కోహిర్ మండలం లోని బడం పేట శ్రీ రాచయ్య స్వామి, దేవాలయం ప్రధాన పూజారి జగదీశ్వర్ స్వామి కి ఉగాది నంది పురస్కారాన్ని  వైదిక పురోహితరత్న  బిరుదును అందజేచారు.వైదిక  పురోహితంలో విశేష సేవలు అందించినందుకు గాను ఉగాది నంది పురస్కారం అందుకున్నందుకు  సంతోషం వ్యక్తపరిచారు.