Monday, 2 November 2026

బడ్జెట్‌ నిరాశపరిచింది: మంత్రి అచ్చెంనాయుడు

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  బడ్జెట్‌ ఏపీకి చాలా ఆశాజనకంగా ఉంటుందని ఆశించామని, కానీ నిరుత్సాహపరిచిందన్నారు. విభజన చట్టంలో అంశాలను వీళ్లు అమలు చేయలేదని ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని, ఏపీని ఆదుకుంటామని చట్టంలోనే పేర్కొనడమే కాకుండా పెద్దలు చాలా హావిూలివ్వడం జరిగిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు కేటాయించడం వల్ల ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందో ఆలోచించాలని సూచించారు. ఏది ఏమైనా కలిసే ఉన్నాం గనుక ఎక్కడ లోటుపాట్లు ఎదురయ్యాయి ? ఏ రంగాలకు నిధులు రావాలో సవిూక్షించి ముఖ్యమంత్రి నాయకత్వంలతో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. ఇచ్చిన హావిూలను పూర్తి చేయాల్సిన బాద్యత వారిపై ఉందని, ఏపీపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ కు లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.  విభజన చట్టంలోని అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్లో జరిగిన అన్యాయాలపై మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవిూక్షించారని చెప్పారు. త్వరలో ఢిల్లీ వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తామన్నారు. జాతీయ ప్రాజెక్‌ట్గా ప్రకటించిన పోలవరానికి రూ. 100కోట్లు ప్రకటించడం చాల దారుణమని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్‌.. ఇలా అయితే 500ఏళ్లైనా పూర్తి కాదని ఆయన ఎద్దేవా చేశారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం అన్నది ఇప్పుడు ప్రశ్న కాదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *