Thursday, 5 November 2026

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు

   కొండమల్లేపల్లి (సెప్టెంబర్ 28): జనం సాక్షి  కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామపంచాయతీలో వైస్ ఎంపీపీ కాసర్ల  వెంకటేశ్వర్లు చేతులమీదుగా బతుకమ్మ చీరలు అందజేయడం జరిగింది అనంతరం కాసర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ తెలంగాణలో సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆడపడుచులు జరుపుకోవాలని కోరారు మరియు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన తెలియజేశారు మరియు గుమ్మడవెల్లి గ్రామ  ప్రజానీకానికి, యువకులకు ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు వివిధ పార్టీల శ్రేణులకు అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రావణ్, అంగన్వాడీ టీచర్ అరుంధతి  మరియు పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Attachments area