సికింద్రాబాద్ (జనం సాక్షి ) స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ లో దివ్యంగులకు పండ్లు,మిఠాయిలు పంపిణీ చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టీఫెన్ సన్ ముఖ్య అతిధిగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ మాట్లాడుతూ ఎంతోమంది వీరుల త్యాగపలితం మనం ఈ రోజు స్వేచ్ఛవాయువులు పిలుస్తున్నామని తెలిపారు.. స్వాతంత్ర్యం పొంది 75ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.. అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న దివ్యంగులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయడం పట్ల అభినడినలి తెలిపారు.. తాను కూడా ఇందులో బాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వగోపి, రమేష్, సిరిగిరి శ్యామ్, సిరిగిరి కిరణ్, కార్తిక్ యాదవ్, అజ్జు, మధు, కాకా, అరుణ్, అమిత్, వెంకటేష్ మరియు శర్వాన్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట్ డివిజన్ లో దివ్యంగులకు పండ్లు,మిఠాయిలు పంపిణీ …




