హైదరాబాద్ :రంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లోని 15 ఫౌల్ట్రీ ఫాంలలో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బర్డ్‌ఫ్లూతో వేలాదిగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఫౌల్ట్రీ ఫాంలకు కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని కోళ్లను చంపేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ణయించారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫాంలలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన ఫాంలను డాక్టర్ల బృందం పరిశీలించనుంది. పరీక్షల తర్వాత మిగిలిన కోళ్లను పూడ్చిపెట్టే అవకాశం ఉంది. బర్డ్‌ఫ్లూతో ఫౌల్ట్రీ రైతుల్లో ఆందోళనకు గురవుతున్నారు. బర్డ్‌ఫ్లూ పై రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.




