గుంటూరు:నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన 28వేల ఎకరాల భూముల్లో సర్వే పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు పరిహారం చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీపై బ్యాంకర్లు, రైతులతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భేటి అయ్యారని, ఈ నెల 25వ తేదీలోగా రుణమాఫీ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.




